కొండాపురంలో కొండచిలువ కలకలం
KDP: కొండాపురం మండలం లావనూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆదినారాయణ ఇంటి సమీపంలో కొండచిలువ కనిపించడంతో కాలనీలో ఆందోళన నెలకొంది. స్థానికులు వెంటనే పామును పట్టే నిపుణుడు మధుసూదన్ రెడ్డికి సమాచారం ఇవ్వగా కొండవచిలువను చాకచక్యంతో పట్టుకున్నాడు. అనంతరం కొండచిలువను ఫారెస్ట్ అధికారులకు అందజేసి, అడవిలో వదిలిపెట్టారు.