'ఎలమంచిలిని అనకాపల్లి డివిజన్‌లో కొనసాగించాలి'

'ఎలమంచిలిని అనకాపల్లి డివిజన్‌లో కొనసాగించాలి'

AKP: ఎలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించాలని వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్‌కు పార్టీ నేతలతో కలిసి వినత పత్రం అందజేశారు. నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే నక్కపల్లి రెవిన్యూ డివిజన్‌లో కలపవద్దని సూచించారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు.