వెంకటేశ్వర స్వామికి బంగారు పుష్పార్చన
JN: చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామికి ఇవాళ అష్టదళ పాద పద్మారాధన వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు.అర్చకులు స్వామివారి పాద పద్మాలను బంగారు పుష్పాలతో అర్చిస్తూ విశేష పూజలు చేశారు. ఈ వేడుకను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.