పుష్య శుద్ధ త్రయోదశి పూజల్లో దక్షిణామూర్తి
CTR: పుష్య శుద్ధ త్రయోదశి సందర్భంగా పుంగనూరు పుష్కరివద్ద ఉన్న ఆలయంలో దక్షిణామూర్తికి గురువారం అభిషేకాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్య వచనం చేపట్టారు. పరిమళ పుష్పాలతో పూజలు చేసి, హారతి సమర్పించారు. గురుదక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, విభూదితో అభిషేకాలు చేశారు. భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు.