యాచారంలో ఎన్నికల సామగ్రి పంపిణీ

యాచారంలో ఎన్నికల సామగ్రి పంపిణీ

RR: యాచారం మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు ఈ నెల 17న జరగనున్న ఎన్నికల కోసం సామగ్రిని పంపిణీ చేశారు. ఎంపీడీవో రాధా రాణి సమక్షంలో ఆదివారం 232 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన పలు రకాల ఎన్నికల సామాగ్రిని పోలింగ్ అధికారులకు అందజేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎంపీడీవో తెలిపారు.