సిరికొండలో పర్యటించిన కలెక్టర్

సిరికొండలో పర్యటించిన కలెక్టర్

ADB: సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పర్యటించారు. వ్యవసాయ పొలాలను సందర్శించి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ విధివిధానాల ప్రకారం నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.