అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

GDWL: జిల్లా వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కారానికి జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ సంతోష్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.