'సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 20.57లక్షల బిల్లు మంజూరు'

KRNL: పెద్దకడబూరు మండలం బసలదొడ్డిలో మూడు సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి రూ. 20,57,705 బిల్లు మంజూరు చేశామని ఏఈ మల్లయ్య ఆదివారం తెలిపారు. ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ యాక్సిస్ బ్యాంక్ ద్వారా డ్రా చేసుకున్నారన్నారు. గ్రామ సర్పంచ్ భర్త తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వర్క్ ఐడీ 80,067కు రూ. 7,29,101, 80,068 కింద రూ.4,91,609, 80,069 కింద రూ. 8,36,995 బిల్లు చేశామన్నారు.