పేదల వైద్యానికి 'CMRF' భరోసా: మాజీ MLA
KKD: పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం కూటమి ప్రభుత్వం CMRF ద్వారా అండగా నిలుస్తోందని మాజీ MLA వర్మ తెలిపారు. ఆదివారం గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఆయన పర్యటించారు. లబ్ధిదారులకు సహాయనిధి చెక్కులను అందజేశారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.