రాజ్యాంగంపై విద్యార్థినిలకు అవగాహన

రాజ్యాంగంపై విద్యార్థినిలకు అవగాహన

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని కళాశాలలో సామాజిక సమరత వేదిక జిల్లా అధ్యక్షుడు నేలనూతల శ్రీధర్ ఆధ్వర్యంలో 76వ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. దాని ప్రాముఖ్యతను విద్యార్థినిలకు వివరించారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి భారత రాజ్యాంగం ఘనత అని చెప్పారు.