టెన్నికాయిట్ విన్నర్‌కు బాహుబలి కాజా

కోనసీమ: మండపేట డిగ్రీ కళాశాల ఇండోర్ స్టేడియంలో జరిగిన 49వ రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు మహిళా విభాగం విజేతకు తాపేశ్వరం సురుచి ఫుడ్స్ లో ఆదివారం సత్కరించారు. పోటీలు ముగించుకుని విశాఖ వెళ్తున్న విజయనగరం జిల్లా క్రీడాకారిణులను తాపేశ్వరం కాజా రుచి చూపించారు. దుస్సాలువాతో సత్కరించి బాహుబలి కాజాను కానుకగా అందజేశారు.