రౌండ్ టేబుల్ ఇండియా సేవలను అభినందించిన ఎమ్మెల్యే

రౌండ్ టేబుల్ ఇండియా సేవలను అభినందించిన ఎమ్మెల్యే

E.G: సమాజంలో అతి కీలకమైన ఆయుధం విద్య మాత్రమేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక రాజేంద్రనగర్‌లోని ఎంపీపీ స్కూల్లో రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ రూ.9 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఆధునీకరించిన పనులను ఆయన ప్రారంభించారు. పాఠశాల స్లాబ్ లీకేజ్, మరుగుదొడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేసిన రౌండ్ టేబుల్ ఇండియా సేవలను ఎమ్మెల్యే అభినందించారు.