వరద నీరుతో చెరువుగా మారిన ZP హైస్కూల్

వరద నీరుతో చెరువుగా మారిన  ZP హైస్కూల్

NDL: ఉయ్యాలవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇవాళ కురిసిన భారీ వర్షానికి చెరువును తలపించేలా మారిపోయింది. వర్షపు నీరు పాఠశాల చుట్టూ నిలిచిపోవడంతో విద్యార్థులు అక్కడికి చేరుకున్నా, లోపలికి వెళ్లలేకపోయారు. ఉపాధ్యాయులు వారిని వెనక్కు పంపించారు. బోడెమ్మనూరు గ్రామంలో పాఠశాలకు వెళ్లే రహదారిలో నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది.