పొదిలిలో భారీ వర్షం.. స్పందించిన కమిషనర్

పొదిలిలో భారీ వర్షం.. స్పందించిన కమిషనర్

ప్రకాశం: పొదిలి పట్టణంలో శుక్రవారం ఉదయాన్నే భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి మురుగునీరు రోడ్లపైకి చేరి పొంగి ప్రవహించింది. ముఖ్యంగా ఆర్టీసీ డిపో వద్ద మురుగు నీరు నిల్వ చేరడంతో వెంటనే నగర పంచాయతీ కమిషనర్ నారాయణరెడ్డి స్పందించారు. వెంటనే శానిటరీ ఇన్‌స్పెక్టర్ మారుతీ రావు, సిబ్బందితో వెళ్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.