శ్రీదాసాంజనేయ స్వామివారి మహా నివేదన
W.G: దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. 45వ శ్రీహనుమద్వ్రత సప్తరాత్ర మహోత్సవాలలో భాగంగా భీమవరం మారుతీ టాకీస్ సెంటర్ లోని శ్రీదాసాంజనేయ స్వామివారి మహా నివేదనను ఇవాళ ఎమ్మెల్యే ప్రారంభించారు. సంప్రదాయ బద్ధంగా 7 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించడం శుభ పరిణామమన్నారు.