ఆటో కార్మికులకు జీవన భృతి చెల్లించాలి: AIRTWF
NGKL: మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు రూ. 12వేలు జీవనభృతి చెల్లించాలని AIRTWF రాష్ట్రకార్యదర్శి పొదిలి రామయ్య డిమాండ్ చేశారు. NGKLలో గురువారం జరిగిన రవాణా రంగా కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, ఆదుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు.