మియాపూర్‌లో వైభవంగా సీతారాముల కళ్యాణం
RR: మియాపూర్‌లోని ప్రగతి ఎన్ క్లేవ్ కమ్యూనిటీ హాల్ లో కాలనీ ప్రెసిడెంట్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. మంత్రోచ్ఛారణల మధ్య వేద పండితులు జరిపించిన ఈ పవిత్ర వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకోగా, అనంతరం జరిగిన అన్నప్రసాద వితరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.