బొమ్మెన గ్రామపంచాయతీ పాలకవర్గం తొలి సమావేశం
JGL: ప్రమాణ స్వీకారానికి ముందే కథలాపూర్ మండలం బొమ్మెన నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం తొలి సమావేశం జరిగింది. సర్పంచ్ చిందం సుధాకర్ అధ్యక్షతన జరిగింది. పలు అభివృద్ధి పనులపై చర్చించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ పిడుగు ప్రతాప్‌తో పాటు వార్డు సభ్యులు అందరూ కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించారు. అన్ని వార్డుల సమస్యలను పరిష్కరించాలని సభ్యులు చర్చించారు.