VIDEO: నేరస్తులను పట్టుకున్న రోబో అర్జున్
విశాఖ రైల్వే స్టేషన్‌లో ఏఐ ఆధారిత రైల్ రోబో కాప్ “ఏఎస్‌సీ అర్జున్” ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా స్టేషన్‌లో సంచరిస్తున్న ఇద్దరు పాత నేరస్థులను పట్టుకుంది. టికెట్లు లేకుండా ప్రవేశించిన వీరిని ఆర్పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది అదుపులోకి తీసుకుని రైల్వే చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఏఐ సాంకేతికతతో రైల్వే భద్రత మరో స్థాయికి చేరింది.