VIDEO: పెందుర్తిలో వైభవంగా శ్రీరామనవమి
శ్రీరామనవమి సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలోని పలు రామాలయాల్లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.