VIDEO: బాన్సువాడ నియోజకవర్గంలో ముమ్మర తనిఖీలు
KMR: బాన్సువాడ నియోజకవర్గం వ్యాప్తంగా FST సభ్యులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం కోటగిరి-బీర్కూర్ మండల సరిహద్దు ప్రధాన రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మద్యం, డబ్బుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో కోటగిరి డిప్యూటీ సాయిబాబా ఉన్నారు.