VIDEO: ప్రమాదాలకు నిలయంగా 9 మైలు బ్రిడ్జి
NLR: జలదంకి మండలంలో 167వ బీజీ జాతీయ రహదారిపై తొమ్మిదవ మైలు వద్ద ఉన్న బ్రిడ్జి ప్రమాదాలకు కారణమవుతోంది. ఇరువైపులా నలుపు రంగు వేయడంతో రాత్రివేళ రోడ్డు అంచులు కనిపించక వాహనాలు అదుపుతప్పుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.