జిల్లాలో 71 మందికి షోకాజ్ నోటీసులు

జిల్లాలో 71 మందికి షోకాజ్ నోటీసులు

జనగాం: జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 71 మందికి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరు వారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.