VIDEO: ఘనంగా పోచమ్మ బోనాల వేడుకలు

VIDEO: ఘనంగా పోచమ్మ బోనాల వేడుకలు

BHPL: గణపురం(M) లక్ష్మారెడ్డిపల్లిలో శ్రావణమాసం చివరి బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షలు చేపట్టి, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా బోనాలు సమర్పించారు. గ్రామస్థులు ఆయురారోగ్యాలు, సమృద్ధి కోసం పోచమ్మ తల్లికి కోళ్లు, పొట్టేలు నైవేద్యంగా సమర్పించారు. మాజీ సర్పంచ్ ఓద్దుల విజయ అశోకరెడ్డి, గ్రామస్థులు ఉన్నారు.