టాటా సియారా వచ్చేసింది..!

టాటా సియారా వచ్చేసింది..!

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌.. తన ఐకానిక్‌ మోడల్‌ సియారాను మళ్లీ తీసుకొచ్చింది. 1991లో తొలిసారి విడుదలైన ఈ మోడల్‌ను.. 2003లో నిలిపివేసింది. దీన్ని ‘రీబర్త్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’గా అభివర్ణించింది. ఈ SUV ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 16 నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయి.