చిట్యాలలో మందకొడిగా సాగుతున్న ఓటింగ్
NLG: చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. బుధవారం ఉదయం నుంచి విపరీతమైన మంచు కురుస్తుండటంతో ఓటర్లు ఇళ్లకే పరిమితమై, ఆలస్యంగా కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు, పలువురు ఓటర్లు సెల్ఫోన్లతో పోలింగ్ కేంద్రాలకు వస్తుండగా, అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.