చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

చిన్నస్వామి స్టేడియం వేదికగా CSKతో జరిగిన మ్యాచ్‌లో RCB స్టార్ ప్లేయర్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. IPLలో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ ఇప్పటివరకు CSKపై 1146 పరుగులు చేశాడు. అలాగే, CSKపై అత్యధిక ఫిఫ్టీ ప్లస్ (10) స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. IPLలో 8500 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు.