పునుగోడు చెరువులో గుర్తు మృతదేహాలు లభ్యం

ప్రకాశం: కనిగిరి మండలం పునుగోడు చెరువులో ఈతకెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే మేకల కాపర్లు అటుగా వెళుతూ చెరువులో శవం కనపడటంతో వెంటనే గ్రామస్తులకు తెలిపారు. ఈ మేరకు గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీరామ్ మృతదేహాలను బయటకు తీయించారు. కాగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.