VIDEO: 'ఏలూరులో సీపీఐ నేతల ధర్నా'

ELR: భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి తక్షణమే అందజేయాలని ఏలూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడారు. పేదవాడి సొంత ఇంటి కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.