ప్రశాంతి నిలయంలో అష్టోత్తర శత నామావళి పఠనం
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో పర్తియాత్ర మూడో రోజు భక్తిభావంతో సాగింది. మహిళా యువత సామూహిక అష్టోత్తర శత నామావళి పఠించారు. సాయి కుమారి తమ సేవా కార్యక్రమాలు, వాటి ద్వారా పొందిన ఆధ్యాత్మిక పరివర్తనను వివరించారు. అనంతరం వివిధ భారతీయ భాషల్లో పది భక్తి గీతాలను ఆలపించారు. ఈ మధుర గీతాలూ భక్తులను అలరించాయి.