వేమవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ ఇదే..!
కోనసీమ: అమలాపురం మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి మంగళవారం తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ స్థల పురాణం చూసుకుంటే ఇక్కడ స్వామి వారు స్వయంభు వెలిశారని ప్రతీతి. ఈ స్వామి వారిని పూజిస్తే సర్ప దోషాలు, నాగ దోషాలు పోతాయని భక్తులు నమ్ముతారు.