సీఎం సహాయ నిధి అందజేత

సీఎం సహాయ నిధి అందజేత

కృష్ణా: పమిడిముక్కల మండలంలోని హనుమంతపురంలో శనివారం సీఎంఆర్‌ఎఫ్ సహాయం అందించారు. పోరంకి అనంతలక్ష్మికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2,50,100 చెక్కును పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వారి నివాసానికి వెళ్లి అందించారు. అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి ఎప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.