పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన తహసీల్దార్
BDK: అశ్వాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని సోమవారం అశ్వాపురం తహసీల్దార్ మణిధర్ సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.