సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
SRPT: సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పెన్ పహాడ్ మండల ఎస్సై గోపికృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాయి పూలే బాలికల గురుకుల పాఠశాలలో సైబర్ నేరాల పైన పోలీసు కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పై మాట్లాడుతూ.. మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు.