నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PLD: పెదకూరపాడు మండల పరిధిలోని 75 తాళ్లూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు కోత ఉంటుందని విద్యుత్ ఏఈ రామకృష్ణ తెలిపారు. తాళ్లూరు సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా కరెంటు కోత ఉంటుందన్నారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.