అద్దంకి డివిజన్‌లో తాగునీటి సమస్యల నివారణకు కలెక్టర్ ఆదేశాలు
బాపట్ల: అద్దంకి రెవెన్యూ డివిజన్‌లో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. అద్దంకిలోని ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన సమీక్షలో నీటి సరఫరా, జల సంరక్షణ, శానిటేషన్ పనులపై ఆయన సూచనలు చేశారు. ట్యాంకుల శుభ్రపరచడం, మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు.