పట్టపగలే విద్యుత్ దీపాల వెలుగులు

SKLM: శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతిపేటలో పట్టపగలే విద్యుత్ వీధి దీపాలు వెలుగుతున్నాయని స్థానికులు తెలిపారు. మధ్యాహ్న సమయం అవుతున్నా ఇంత వరకు లైట్లు వెలుగుతూ దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ అధికారులు పర్యవేక్షణ కరువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలు విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.