అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన విద్యార్థులు
ATP: శింగనమల నియోజకవర్గంలోని సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, MLA బండారు శ్రావణిని కలిశారు. సభలు జరిగే తీరును ఆమె వివరించారు.