'ప్రతిరోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నాం'
వంట గ్యాస్ కొరతపై కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. ప్రతిరోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామని తెలిపింది. హర్మూజ్ జలసంధి నుంచే మెజార్టీ శాతం సరఫరా జరుగుతుందని వెల్లడించింది. హర్మూజ్ జలసంధిలోని 28 భారత నౌకలు సేఫ్‌గా ఉన్నాయని తెలిపింది. గ్యాస్ సంక్షోభాన్ని నివారించడంలో రాష్ట్రాలే కీలకమని పేర్కొంది. బ్లాక్ మార్కెట్‌ను రాష్ట్రాలే నిరోధించాలని సూచించింది.