VIDEO: రైతులతో మాట్లాడిన మాజీ సీఎం
కృష్ణా: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ గూడూరు మండలంలోని రామరాజుపాలెం గ్రామంలో పంట పొలాల్లోకి రైతులతో మాట్లాడారు. అనంతరం ఒడుబోయిన బ్రహ్మకృష్ణ, పరసా శ్రీనివాసరావు అనే రైతులకు చెందిన నేలకొరిగిన వరి పంటలను ఆయన పరిశీలించారు. రైతులు ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ మేర నష్టపోయారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.