ఏజెన్సీలో హై అలర్ట్.. బస్సులు నిలిపివేత
ASR: ఏవోబీలో హై అలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్ట్ PLG వారోత్సవాల దృష్ట్యా ప్రతీకార దాడులు జరగవచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో పాడేరు ఏజెన్సీలో ముమ్మరంగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లొద్దని నేతలకు సూచించారు. అలాగే, మద్దిగరువు, కుమడ, కోరుకొండకు వెళ్లే బస్సులను నిలిపివేశారు.