మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

NZB: దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణన చేపట్టాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని పురస్కరించుకొని ఖిల్లా రామ్ మందిర్ మండల్ వర్ని చౌరస్తా వద్ద మటం పవన్, కల్పే చిరంజీవి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్రవంతి రెడ్డి, కోడూరు నాగరాజు, బుస్సాపూర్ శంకర్, నారాయణ పాల్గొన్నారు.