రూ.100 కోట్ల క్లబ్‌లోకి నాని సినిమా

నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్ 3’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.101 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ 'సర్కార్ సెంచరీ' అని కాప్షన్‌తో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి తమ సంతోషాన్ని పంచుకుంది.