VIDEO: అసత్య ప్రచారంపై యానిమేటర్లు ధర్నా
KKD: జగ్గంపేట(M) రాజపూడిలో యానిమేటర్‌పై అసత్య ప్రచారానికి నిరసనగా డ్వాక్రా గ్రూపు సభ్యులు, యానిమేటర్లు ధర్నా చేపట్టారు. యానిమేటర్ దవరసింగు హైమావతిపై దుష్ప్రచారం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజనిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.7,75,000ల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ హైమావతి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.