రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు

NDL: శిరివెళ్ల మండలం యర్రగుంట్ల పరిధిలోని ఉషోదయ పాఠశాల వద్ద జాతీయ రహదారిపై సోమవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో యర్రగుంట్లకు చెందిన నిమ్మకాయల చిన్న బాషాకు గాయాలయ్యాయి. నంద్యాలకు చెందిన మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కొనఊపిరితో ఉన్న క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.