బాలిక అదృశ్యం.. కేసు నమోదు
అన్నమయ్య: బాలిక అదృశ్యంపై సోమవారం కేసు నమోదు చేసినట్లు SI రమేష్ బాబు తెలిపారు. రామసముద్రం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పరిసర గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.