రేపు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం

కృష్ణా: సెప్టెంబర్ 1న సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించునున్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదివారం తెలిపారు. మండల కేంద్రాలతో పాటు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.