కొండగండ్రేడులో మార్మోగిన గోవింద నామస్మరణ
VZM: గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామం గోవింద నామస్మరణతో బుధవారం మార్మోగింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ సాదుపరిషత్ అధ్యక్షుడు స్వామీజీ శ్రీనివాసనంద సరస్వతి, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.