ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలి

ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలి

KMR: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారుల జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని, శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఎ. మహేష్ కుమార్ అన్నారు. గత వారం రోజులుగా మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో కమిటీలు తీర్మానించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాను నోటీస్ బోర్డ్ నందు కమిషనర్ వార్డు అధికారులతో కలిసి ప్రదర్శించారు.