VIDEO: చాపరాయి జలపాతంలో పర్యాటకుల సందడి
ASR: చాపరాయి జలపాతంలో ఆదివారం పర్యాటకుల రద్దీ పెరిగింది. గత వారం రోజులుగా వెలవెలబోయిన జలపాతం ఒక్కసారిగా సందడిగా మారింది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న పర్యాటకులు జలపాతం వద్ద స్నానాలు చేస్తూ ఉపశమనం పొందుతున్నారు. కుటుంబాలతో వచ్చిన సందర్శకులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ గడిపారు. పర్యాటకుల రాకతో చిరు వ్యాపారులకు వ్యాపారం ఊపందుకుంది.